పచ్చల హరితహారంగా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Tuesday March 22, 2022
వికారాబాద్ బ్యూరో 21 మార్చి ప్రజాపాలన : జిల్లాలో పచ్చదన్నాన్ని పెంపొందించేందుకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్బంగా సోమవారం ఫారెస్ట్ నర్సరీలో జిల్లా కలెక్టర్ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ శాఖ ద్వారా నిర్వహించే నర్సరీలలో నాణ్యమైన పెద్ద సైజు మొక్కలు పెంచి రాబోయే హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్ కొరకు అవసరమైన మొక్కలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని, అట్టి మొక్కలను నీరు పోసి సంరక్షించాల్సిన అవసరముందన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 17 నర్సరీల ద్వారా 8 లక్షల మొక్కలు పెంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా ఫారెస్ట్ అధికారి వేణుమాధవ్, డీపీవో మల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.