మాటూరు పేట గ్రామస్తుడుపోతినేని వారి ఆత్మీయ సమ్మేళనం

Published: Wednesday February 01, 2023
మధిర రూరల్ జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో పోతినేని వారిిిి ఆత్మీయ సమ్మేళనంఆత్మీయ సమ్మేళనానికి రూపశిల్పి మాటూరుపేట గ్రామస్తుడు.పోతినేని హనుమంతరావు...*
పోతినేని కుటుంబ సభ్యులందరితో "గెట్ టు గెదర్" కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మధిర మండల వాసి మన పోతినేని...*
హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్,తబలా ఫంక్షన్ హాల్ లో సోమవారం జరిగిన పోతినేని వారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరుపేట గ్రామస్తుడు పోతినేని హనుమంతరావు ఆధ్వర్యంలో ఆత్మీయ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ టాలీవుడ్ హీరో పోతినేని రామ్ తండ్రి పోతినేని మురళి మోహన్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం విధులు కొనసాగిస్తున్న డిఎస్పి పోతినేని కృష్ణ ప్రసాద్ పాల్గొని ఆత్మీయ సమ్మేళనం మాట్లాడారు.మధిర మండల వాసి పోతినేని హనుమంతరావు రెండు తెలుగు రాష్ట్రాల పోతినేని కుటుంబ సభ్యులందరితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జీవితంలో మర్చిపోలేని తీపి గుర్తుగా ఉంటుంది అన్నారు.ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.