నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కొరకు ప్రత్యేక కార్యక్రమం జిల్లా ఉపాధి కల్పన అధికారి వె

Published: Thursday January 19, 2023
మంచిర్యాల బ్యూరో, జనవరి 18, ప్రజాపాలన :
 
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వంలోని కార్మికశాఖ, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద నమోదు అయిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ, జపాన్ ప్రభుత్వ పథకం, స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ క్రింద జపాన్లో పని చేసేందుకు అర్హత గల నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకట రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జపాన్ లో విదేశీ ఉద్యోగ నియామకాల కొరకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గం॥లకు జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, నమోదిత కళాశాలలు / సంస్థల నుండి బి.ఎస్.సి. నర్సింగ్ గ్రాడ్యుయేట్లు / జి.ఎన్.ఎం. డిప్లొమా హోల్డర్లు ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ముందస్తు పని అనుభవం అవసరం లేదని, 22-35 సం॥ల మధ్య వయస్సు ఉండాలని తెలిపారు. ఎంపిక చేయబడిన అభ్యర్థులకు జపనీస్ భాషపై రెసిడెన్షియల్ శిక్షణ, జపాన్లో పని చేయడానికి అవసరమైన అదనపు వృత్తి పరమైన నైపుణ్యాలు అందించబడతాయని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ హెచ్.ఆర్. మేనేజర్లను 9951909863, 9100798204. సంప్రదించవచ్చని, రెస్యూమ్ను hrm-tomcom-letf@telangana.gov.in ఈ-మెయిల్ చేయవచ్చని, వివరాలకు www.tomcom.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చని, TOMCOM యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
 
Reply
Forward