మీడియా అంటే, ప్రజల గొంతుకను వినిపించే, కనిపించే అక్షరం

Published: Thursday February 10, 2022
వికారాబాద్ బ్యూరో 09 ఫిబ్రవరి ప్రజాపాలన : మీడియా అంటే ప్రజల గొంతుకను వినిపించే కనిపించే అక్షర సాధనమని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్‌పి ఎన్.కోటి రెడ్డి ఐపీఎస్ వికారాబాద్ జిల్లా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ కత్తి కన్నా కలం గొప్పదని పేర్కొన్నారు. మీడియా అనేది సమాజంలో 4th ఎస్టేట్ అని గుర్తుు చేశారు. జిల్లాలోని మీడియా విలేఖరులు అందరూ కూడా ఒక సామాజిక భాద్యతగా బావించి ప్రజలలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, మత్తుపదార్థాలు, గుట్కా, గంజాయి, మొదలగు విషయాలపైనా అవగాహన కల్పించాలని కోరినారు. పోలీస్ ఎన్ఫోర్మెంట్ కార్యక్రమాపై ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు మారుతూ ఉంటారు కానీ వ్యవస్థ మాత్రం స్థిరంగా ఉంటుంది అని పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీస్ మరియు మీడియా కలిసి పనిచేయడం నేటి సమాజంలో అనివార్యం అని అన్నారు. పోలీస్ మరియు మీడియా కలిసి సమన్వయంతో పని చేయడంతో మారుమూల గ్రామ ప్రజలలో కూడా అనేక విధాలుగా చైతన్యం తీసుకురాగలమని తెలిపినారు. మీడియా ప్రతినిదులు తమ అక్షరాలను సమాజంలో మంచి మార్పుకొరకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. పోలీస్ మరియు మీడియా ఎల్లపుడూ ప్రజలలో ఉంటారు కావున సమాజనికి  భాద్యతగా, మార్గదర్శిగా, దిక్సూచిగా ఉండాలని తెలిపారు. పోలీస్,మీడియా అధికారులు ఒకరికి ఒకరు ఎల్లపుడూ సమన్వయంతో పని చేసి గంజాయి, గుట్కా, మట్కా, పేకాట మొదలగు విషయాలపైనా మరింత విజయం సాధించవచ్చు అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి యొక్క సమాచారాన్ని పోలీస్ అధికారులకు గాని డైల్ 100 కు గాని ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా ఎస్‌పి కోరారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, తగ్గించడం పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పెంచి గంజాయి, గుట్కా, మట్కా, ఇసుక అక్రమ రవాణా మొదలగు కార్యకలాపాలను కట్టడి చేయడం జిల్లా లో నాకాబందీ లాంటి కార్యక్రమాలను కొనసాగించడమే ఈ సంవత్సరం తమ లక్ష్యం అని జిల్లా ఎస్‌పి తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి ఎం ఏ రశీద్, డి‌టి‌సి అదనపు ఎస్‌పి అష్పక్ తాండూర్ డి.ఎస్.పి లక్ష్మినారాయణ, వికారాబాద్ డి.ఎస్.పి సత్యనారాయణ, పరిగి డి‌ఎస్‌పి శ్రీనివాసులు ఏ‌ఆర్ డి‌ఎస్‌పి సత్యనారాయణ పోలీస్ అధికారులు మరియు జిల్లాలోని వివిధ పత్రికా మరియు ప్రింట్ మీడియా విలేఖరులు పాల్గొన్నారు.