జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక నివేదిక 2022 ** జిల్లా ఎస్పీ కే స

Published: Friday December 30, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 29 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా పోలీస్ వార్షిక నివేదిక -2022 ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2022 సం లో కేసులు,4 ఆస్తి సంబంధిత నేరాలు, 4 నరహత్యలు,37 కిడ్నాప్ కేసులు,17 పి,ఓ,సి,ఎస్,ఓ, ఏ,సి,టి,కేసులు,21 గంజాయి కేసులు, 29 సైబర్ కేసులు,149 మహిళలపై అఘాయిత్యాలకేసులు, నమొదయాయని అన్నారు. కాగా గత సం లో17 హత్య కేసులు,10 ఆస్తి సంబంధిత నేరాలు,7 నరహత్యలు, 38 కిడ్నాప్ కేసులు, 24 పిఓపిఎస్ఓ, ఏసిటీ కేసులు,59 గంజాయి కేసులు,16 సైబర్ నేరాలు,196 మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపారు.2022 వ సంలో జిల్లా పోలీసులు అహర్నిశలు చేసి శాంతి భద్రతను కాపాడటానికి తక్షణమే న్యాయం జరగటానికి శోధన పూర్తిచేసి కోర్టులో చార్జీ సీటు దాఖలు చేయడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం ఇదే స్ఫూర్తితో పోలీసులు కృషి చేసి ప్రజల ఆధారాభిమానాలకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్,సీఐ రానా ప్రతాప్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.