నక్కలగరుబు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు

Published: Thursday March 10, 2022
మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం పరిధిలోని నక్కల గరుబు గ్రామ పంచాయతీలో సర్పంచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని సహాయ సహకార సంఘాల మహిళలకు, గ్రామంలోని మరికొంతమందికి మహిళలకు, సెక్రటరీ హేమలత కు సర్పంచ్ వెంకటమ్మ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల కలుపుకుంటూ గ్రామపంచాయతీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలు కూడా పురుషులతో భాగం అన్ని విధాల లోరాజకీయ చైతన్యం ఉండాలని కెసిఆర్ ప్రభుత్వం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.