కోటేశ్వర స్వామి హుండీ లెక్కింపు

Published: Friday March 19, 2021
వెల్గటూర్, మార్చి 18(ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పార్వతీ కొటేశ్వరస్వామి హుండీ లెక్కింపు గురువారం ఆలయ కమిటీ చైర్మన్ పదిరా నారాయణ రావు, ఈ ఓ మారుతీ రావు, ఆధ్వర్యంలో లెక్కించారు. ఆదాయం 1,40,129 రూపాయలు, ప్రత్యేక దర్శనం,అభిషేకాల ద్వార రూ.70, 500 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో. సర్పంచ్ లు మౌనిక, యాగండ్ల తిరుపతి, ఆలయ ధర్మకర్తలు బోనగిరి సత్తయ్య, కనపర్తి సుధాకర్ రావు,నులిగొండ కళావతి, దాసరి లింగయ్య, ఎల్కటూరి తిరుపతి, బిడారి మొండయ్య, అర్చకులు సంజీవ్ శర్మ, నాగరాజు శర్మ, హర్ష శ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.