తక్కెళ్ళపాడు గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దివంగత జోజప్ప సంతాప సభలో పాల్గొన్న కాంగ్రెస్

Published: Friday April 09, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 8వ తేదీ మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామ అధ్యక్షులు జోజప్ప ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా ఈ రోజు వారి సంతాపసభ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు పెద్దలు ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మేళం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి సంతాప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిస్వార్ధంగా కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా తను చేసిన కార్యక్రమాలు ఎన్నటికీ మర్చిపోలేము అని వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు శీలం శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ బండారు నరసరావు గారు నాగబాబుగారు మైనార్టీ సెల్ అధ్యక్షులు జాన్ బాషా సొసైటీ సభ్యులు కడియం శ్రీనివాస్ తెలుగుదేశం నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి అంబడిపూడి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ మధిర పట్టణ డివిజన్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య మాగం ప్రసాద్ చౌదరి కోట నాగరాజు కోట డేవిడ్  గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.