సంస్థలు ఏవైనా ఆయా యూనియన్ల పై ఆధారపడి పని చేయాల్సిందే

Published: Monday September 06, 2021
టీయూడబ్ల్యూజే (ఐ జే యూ) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మంగపతి చంద్రశేఖర్
బెల్లంపల్లి, సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : సంస్థలు ఏవైనా అవి వాటి యూనియన్ల పై ఆధారపడి పని చేయాల్సి ఉంటుందని స్వతంత్రంగా పని చేస్తే అవి రాణించ లేవని టీయూడబ్ల్యూజే (ఐ జే యు) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మంగపతి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నాడు స్థానిక పద్మశాలి భవన్ లో జరిగిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రెస్ అనేది కత్తి మీద సాము లాంటిదని అతి జాగ్రత్తగా పని చేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని, నీతి నిబద్ధత లేకపోతే ఈ వృత్తిలో రాణించ లేరని, జర్నలిస్ట్ అనేవాడు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని  అలాంటప్పుడే  సముచిత స్థానం ఉంటుందని అన్నారు. అలాగే యూనియన్ల సహకారం లేనిదే ప్రెస్ క్లబ్ లు మనుగడ సాధించలేవని ప్రతి ఒక్కరు వీటిని ఆచరించాలని ఆయన సూచించారు. అనంతరం ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీని ఆయన అధికారపూర్వకంగా ప్రకటించారు. బెల్లంపల్లి నూతన ప్రెస్ క్లబ్ కు గౌరవ సలహాదారులుగా సీనియర్ పాత్రికేయులు సజ్ను షఫీ, తనుగుల రాజన్న లను, బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా తణుకు కృష్ణ (ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా బద్రి వెంకటేష్ (నినాదం), కోశాధికారిగా బద్రి శివ ప్రసాద్ (స్కైలైన్), ఉపాధ్యక్షులుగా సీనియర్ విలేకరి కారుకూరి సదానందం (దిశ), సీనియర్ విలేకరి దండ బోయిన భాస్కర్ (ప్రజాపాలన) సీనియర్ విలేకరి బండి ప్రవీణ్ కుమార్(వుదయం) సీనియర్ విలేకరి సుంకరి సుదర్శన్ నక్క సంతోష్ (టీవీ5) రమేష్ (ఎస్ 10 న్యూస్), ఎంబడి సతీష్ (సాక్షి టీవి) సంయుక్త కార్యదర్శులుగా కిరణ్ (ప్రజా పక్షం) రాజశేఖర్ (పసి టీవీ) ఆర్ మోహన్ (యాదాద్రి) రాజేందర్, ప్రచార కార్యదర్శులు గా మనోజ్ కుమార్ పాండే(శుభ్ లాబ్) దుర్గం నాగరాజు (మన తెలంగాణ) కత్తుల నవీన్ (ఎన్ ఎస్ టివి)కే వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా సిద్ధిక్, ప్రజాతంత్ర, క్యాతం సురేష్ (ఐ ఎన్ బి న్యూస్), బజరంగ్ (నవభారత్), శ్రావణ్ కుమార్, శ్రీనివాస నాయక్, వొల్లాల సంతోష్, అశోక్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎంపికైన కార్యవర్గ సభ్యులను జిల్లా పత్రికారంగం అధ్యక్షుడు మంగపతి చంద్రశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా రంగం అధ్యక్షుడు సంపత్ రెడ్డి లు ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించడం జరిగింది. ఎంపికైన సభ్యులు విలేకర్ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కాంట చౌరస్తాలో టపాకాయల పేల్చి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాప్రభుత్వ ఐక్య ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు దాసరి వెంకటరమణ, నూతనంగా ఎంపికైన ప్రెస్ క్లబ్ కార్యనిర్వహణకు ప్రతి నెల రెండు వేల రూపాయలను విరాళంగా ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో రాణిస్తూ ఉన్నత విలువలతో కూడిన సమాజాభివృద్ధిలో విలేకరులు రాణించాలని ఆయన ఆకాంక్షించారు.