నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంత

Published: Wednesday November 30, 2022

నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి నియోజకవర్గ కార్యకర్తల మీటింగులు  జరిగినటువంటి సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధితో పాటు బూర్గంపాడు మండలానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని. ఈ సమావేశంలో తెలియజేయడం జరిగినది. ప్రజలు బాగుండాలి అంటే ప్రజలలో తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలు తెలుసుకొని నడుచుకోవడంలోనే ఎంతో తృప్తి ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగినది.. మండల అభివృద్ధి కోసం అంతర్గత రోడ్ల కోసం, హాస్పటల్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగినదని రాబోయే కాలంలో మరిన్ని నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురావడం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగినది. ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని దానిలో భాగంగానే రైతుల కోసం రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అమోఘమైన పథకాలతో రైతు అభ్యున్నతికి తోడ్పడుతుందని 24 గంటలు కరెంటు ఇస్తుందని షాదీ ముబారక్ర , కళ్యాణ్ లక్ష్మీ వంటి పథకాలతో తెలంగాణ ఆడపడుచులకు అన్నగా కేసీఆర్ ఉంటారని వారి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పిఎసిఎస్ చైర్మన్ బిక్షసాని శ్రీనివాసరావు, సారపాక టౌన్ ప్రెసిడెంట్ శ్రీను, ప్రధాన కార్యదర్శి ఏసోబు, యువ నాయకుల చల్లకోటి పూర్ణ, చైతన్య రెడ్డి, భారీ శ్రీహరి, సాయిబాబా చుక్కపల్లి బాలాజీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.