అధికారపక్ష నియంతృత్వ పోకడలు మానుకోవాలి.. : కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు

Published: Wednesday April 27, 2022
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 26, ప్రజాపాలన : ప్రతి నెలా జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారపక్ష నియంతృత్వ పోకడలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, కౌన్సిలర్ పుదరి సునీత మాట్లాడుతూ మున్సిపల్ జనరల్ ఫండ్ 44 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసి పట్టణంలో మంచి నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్ లపై కొంతమంది అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల ఫోటోలు మాత్రమే ఫ్లెక్సీ పెట్టుకోవడం పై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే కౌన్సిలర్ కో ఆప్షన్ సభ్యుల ఫోటోలతో ఫ్లెక్సీ పెట్టాలని లేదంటే ఉన్న ఫ్లెక్సీ తీసివేయాలని డిమాండ్ చేస్తూ దీనికి సమాధానం చెప్పాల్సిందిగా చైర్మన్ ను పట్టుబట్టడం జరిగింది. ఇందుకు మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీ తీయడం జరగదు మిగతా వారి ఫోటోలు పెట్టడం జరగదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం. దీని విషయమై చర్చించడానికి నిరాకరించడంతో మున్సిపల్ సమావేశాన్ని కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు బహిష్కరించడం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. మిషన్ భగీరథ పనులు నత్తనడక నడుస్తున్నందున, వారి  చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఏ వన్ గ్రేడ్ గల మున్సిపాలిటీలో ఇంకా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం సిగ్గుచేటని వారు అన్నారు. చాతనైతే మిషన్ భగీరథ పనులు వేగవంతం చేసి ప్రతిరోజు ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు  పన్నుల రూపంలో కట్టిన లక్షల రూపాయల నిధుల ద్వారా వాటర్ ట్యాంకర్లు కొనుగోలు చేసి వాటిపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కొందరివి మాత్రమే ఫ్లెక్సీలు పెట్టుకొని వారే సొంతంగా సరఫరా చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సొమ్మొకడిది సోకొకడిది లాగా ఉందన్నారు. ప్రతినెలా మున్సిపల్ కం కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ప్రజల సమస్యలపై చర్చించడానికి ప్రయత్నించగా వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ చైర్మన్ నియంతృత్వ పోకడలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షేక్ మాజీద్ కౌన్సిలర్లు రామగిరి బానేశ్, పుదరి సునీత ప్రభాకర్, కొండ పద్మ చంద్రశేఖర్, జోగులు శ్రీలత సదానందం పాల్గొన్నారు.