వైరా నూతన ఏ సి పి గా ఎం ఏ రెహ్మాన్

Published: Friday July 08, 2022
బోనకల్, జులై 8 ప్రజా పాలన ప్రతినిధి: వైరా నూతన ఏ సి పి గా ఎం ఏ రెహ్మాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ విష్ణు వారియర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఎంఏ రెహమాన్ సూ ర్యాపేట డి ఎస్ పి, డి సి ఆర్ బి ఫంక్షనల్ వర్టికల్ అధికారిగా పనిచేస్తూ వైరా ఏ సి పి గా బదిలీ పై వచ్చారు. ఇప్పటి వరకు ఏ సి పి గా పనిచేసిన కె సత్యనారాయణ ను హైదరాబాద్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయానికి ఎటాచ్ చేశారు. ఆయనది బదిలీ కానందున వైరా కు స్నేహా మోహ్రా,(ఐ పి ఎస్) సాధన రష్మి పెరుమాళ్(ఐ పి యస్ ) ట్రైనీ ఏ సి పి లు గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కె సత్యనారాయణ ను పూర్తిగా హైదరాబాద్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 
 
Attachments area