సమస్యల పరిష్కారమే మీరు నేను - ఎమ్మెల్యే సంజయ్

Published: Thursday March 02, 2023

జగిత్యాల, మార్చి 01 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండల్ కల్లేడ సోమనపల్లి గ్రామాలలో మీరు-నేను కార్యక్రమంలో భాగంగా ఉదయం వాడవాడ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలు అధికారుల ద్వారా అక్కడికక్కడే పరిష్కరిస్తూ వార్డుల్లో పర్యటించి ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి 9 మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మెన్ డా: చంద్రశేఖర్ గౌడ్ గ్రామ మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.