మున్సిపల్ కమిషనర్ అభివృద్ధికి సహకరించని ఎండి యూసుఫ్ ఇబ్రహీంపట్నం చైర్ పర్సన్ కప్పరి స్రవం

Published: Friday July 22, 2022
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో  కమిషనర్ యూసూఫ్ ఒక నియంతలా వ్యవహరిస్తూ తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని చైర్ పర్సన్ కప్పరి  స్రవంతి నిరసనతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మున్సిపల్ అభివృద్ధికి స‌హ‌క‌రించ‌ని క‌మిష‌న‌ర్ ఎండి యూసుఫ్ ను వెంటనే తొల‌గించాల‌ని చైర్ ప‌ర్సన్‌ డిమాండ్ చేశారు. క‌మిష‌న‌ర్ తీరును వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ చైర్ పర్సన్ చాంబర్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ సుమారు నెల రోజులుగా విధుల్లోకి  హాజరుకాకుండా పట్టణసమస్యలను ప‌క్కన‌బెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని ఎప్పుడో ఒకసారి వచ్చి హాజరైనట్టుగా సంతకాలు పెట్టి వెళ్తున్నారని ఆరోపించారు. వర్షాలు పడుతున్న సమయంలో అందుబాటులో ఉండకుండా  ప్రజా సమస్యలను పట్టించుకోకుండా  చరవాణిలో కూడా స్పందించలేదని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారని చైర్ పర్సన్ స్రవంతి తెలిపారు. నియంతలా వ్యవహరిస్తూ మున్సిపల్ అభివృద్ధికి ఆటంకంగా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారని చైర్ పర్సన్ కప్పరి స్రవంతి స్రవంతి పేర్కొన్నారు. వర్షాకాలంలో సైతం ఫ్యాగింగ్, 6 నెలల నుంచి విది దీపాలు నిర్వహణ చూడాలని లేదని  మున్సిపల్ కమిషనర్ కు ప్రజాసమస్యల పై అవగాహన లేదని వ్యాఖ్యానించారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ , సీడీఎంఏ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రజలకు ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రజల ఆస్తులను కూల్చివేతలు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, మిషన్ భగీరథ పనులు తమకు సంబంధం లేదని, అని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.  ప్రజలు అవస్థలు పడుతున్నా , ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు కనీస సమాచారం ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతూ ప్రోట్ కాల్ పాటించకుండా కొంత మంది కౌన్సిలర్ల ను వెంటబెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని కప్పరి స్రవంతి ఆరోపించారు. 
 
 
 
Attachments area