కోవిడ్ కేర్ సెంటర్, ఐసోలాషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పువ్వాడ అజయ్ కుమార్

Published: Wednesday May 19, 2021
మధిర, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : మండలం కృష్ణాపురం గ్రామం గురుకుల పాఠశాలకోవిడ్ వైరస్ నియంత్రణ ప్రక్రియలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచిన Remedesivir ఇంజెక్షన్స్, ఆక్సిజన్ తో కూడిన 20 బెడ్స్ తో ఐసోలాషన్ వార్డును ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. మధిరలోని కృష్ణాపురంలోని మహాత్మా జ్యోతిభా పూలే బిసి గురుకుల విద్యాలయంలో 100 బెడ్స్ తో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారభించారు. వారి వెంట ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్  మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, DM&HO మాలతి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.