పలు కాలనీలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించిన మేయర్

Published: Tuesday April 27, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : కరోనా విలయ తాండవం చేస్తున్న వేల  ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 1వ, 3వ డివిజన్ లలో పర్యటించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. సోమవారం నాడు పలు కాలనీల పర్యటనలో భాగంగా రెండు డివిజన్ల లో శానిటేషన్ సిబ్బందితో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించి కాలనిలలో అపరిశుభ్రంగా ఉండకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కరోనా విలయతాండవం చేస్తున్న వేళా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆమె ప్రజలని కోరారు. అవసరం అయితేనే తప్ప బయటికి రావద్దుని అన్నారు. వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ తప్పక వేసుకోవాలని అపోహలను నమ్మకుండా ధైర్యంగా వాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు రామిడి సురకర్ణ రెడ్డి, శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి, పారిశుద్ధ కార్మికులు సిబ్బంది,  కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.