మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన ... బూర్గంపాడు బ

Published: Wednesday December 21, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
రేపటి నుంచే కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు .9 జిల్లాల్లోని గర్బిణులకు పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
 రూ. 50 కోట్లతో గర్బిణులకు వరంగా మరో అద్భుతమైన పథకం. అని బూర్గంపాడు బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్  జలగం జగదీష్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసిందని వారు అన్నారు.అత్యధికంగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ ల‌లో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు.
ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్‌కు రూ. 1962 తో రూపొందించి, కిట్లను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది వారు అన్నారు.