టపాకాయల దుకాణాల్లో పోలీసుల ఆకస్మిక సోదాలు

Published: Friday October 08, 2021
కోరుట్ల, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్న పలు షాపుల్లో ఎస్ ఐ చిర్ర సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా టపాకాయలు నిల్వ ఉంచిన మూడు షాపుల్లో ఉన్న మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి అగ్నిమాపక సిబ్బందికి అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ లైసెన్సు లేకుండా టపాకాయలను నిల్వ ఉంచిన అమ్మకాలు జరిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన సమర్థ ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచడం ద్వారా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. లైసెన్స్ పొందిన వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాల్లోనే విక్రయాలు జరపాలని సూచించారు.