చలో రాజ్ భవన్ కు వెళుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టు

Published: Friday July 23, 2021
మెట్ పల్లి, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల యొక్క ఫోన్ లను ట్యాపరింగ్ ను ఇజ్రాయిల్ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా టపర్ రింగ్ చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా, తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి తరలివెళుతున్న మెట్ పల్లి కాంగ్రెస్ నాయకులను బుధవారం అర్థరాత్రి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పట్టణంలోని సుల్తాన్ పురలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా మాట్లాడుతూ అప్రజాస్వామికంగా ఇతరుల మాటలు వినడం అనేది సహించరాని చర్య అన్నారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేస్తే సహించమని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ముందస్తు అక్రమ అరెస్టులు గృహనిర్బంధలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల యొక్క ఫోన్ ట్యాపరింగ్ చేస్తూ 2023 లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందే పసిగడుతూ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపరింగ్ చేయడం నేరంనే పరిగణిస్తున్నామన్నారు. గోడ చాటున వినడం చట్టవిరుద్ధం ఇది మేము తీవ్రంగా తప్పు పడుతున్నాము అని ఆయన అన్నారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇది సరికాదని అన్నారు. అరెస్టు అయిన వారిలో స్టేట్ మైనారిటీ కన్వీనర్ అబ్దుల్ హఫీజ్ మాజీ పట్టణ అధ్యక్షులు బెజ్జారపు శ్రీనివాస్ కోటగిరి చైతన్య ఉన్నారు.