కొండయ్య కు జాతీయ పర్యా వరణ మిత్ర విశిష్ట సేవా పుర్ స్కారంనో ప్లాస్టిక్ : వస్త్ర సం చులపై ప్రచా

Published: Tuesday September 28, 2021
మధిర, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ప్రముఖ సామాజిక సేవకుడు మధిర ఆశ మిత్ర శ్రీ లంకా కొండయ్యకు అదివారం రాత్రి హైద్రాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ పేరుగాంచిన హోప్ స్వచ్చందసంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ సూర్యాపేట జిల్లా వారిచే జాతీయ కవి కోకిల గుర్రం జాషువా 126వ జయంతి సందర్బంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారినీ మేధావులు చేత ఎంపిక చేసి జాతీయ అవార్డుల ప్రధానంలో భాగంగా ఖమ్మం జిల్లా నుండి పర్యా వరణ పరిరక్షణకు కొండయ్య కు ప్రముఖ వాగ్గేయ కారుడు కవి రచయిత శ్రీ గోరేటి వెంకన్న ప్రముఖ ఆంధ్రప్రభ ఎడిటర్ వైస్సార్ శర్మ మల్కాజి గిరి సెషన్ కోర్ట్ జెడ్జి శ్రీ బూర్గుల మధు సుధన్ రావు, ప్రముఖ సినీ రచయిత దైవజ్ఞ శర్మ, ప్రముక కవి బిక్కి కృష్ణ, టీవీ ఆర్టిస్ట్ కోవిధ సహృదయ ఫౌండేషన్ డైరెక్టర్ అనూహ్య రెడ్డి, సూర్యపేట  గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, హోప్ స్వచ్చందా సంస్థ మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ dydha వెంకన్న చేతులు మీదుగా  రవీంద్ర భారతిలో ప్రశంసాపత్రం మెమోంటో, దుస్సాలువా జాతీయ పర్యావరణ మిత్ర విశిష్ట సేవా పురస్కారం లభించింది. అతను ఎంచుకున్నది సంఘ సేవా సామజిక రుగ్మాతల పై తనదైన శైలిలో వివిధ జానపధ కళా రూపాల ద్వారా జన సమూహంలో చొచ్చుకొని పోయి స్వచ్చందoగా ప్రజలను చైతన్య పరిచి జన జాగృతి కీ కృషి చేయటం ఆయన అభి మతం. వృత్తి రీత్యా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున హెల్త్ సూపర్ వైజర్ గా విస్తృత ము గా సమగ్ర ఆరోగ్య సేవలు అందిస్తూ మరో వైపు కాళీ సమయాలు సెలవు దినాలు మరియు రాత్రి పూట గ్రామల్లో స్వచంధంగా చిన్న చిన్న కళా జాతలు ఏర్పాటు చేసి సామజిక రుగ్మతలు పై ప్రజలకు అవగాహన చేస్తుంటారు. ఇందులో భాగంగా నో ప్లాస్టిక్ పేరిట ప్లాస్టిక్ వస్తువులు నిషేధం, వస్త్ర సంచులు తయారీ ప్రచారం, మొక్కలు పెంపకం. ఈ సందర్బంగా లంకా కొండయ్య మాట్లాడుతూ నా సేవలు గుర్తింపు ఇచ్చిన హోప్ స్వచ్చందసంస్థ మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ కమిటీ వారికీ పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ అవార్డు పొందిన కొండయ్యను ఖమ్మం జిల్లా మరియు మధిర నియెజక వర్గ ప్రాంత ప్రముఖులు రాజకీయ నాయుకులు వ్యాపారస్తులు ఆర్యవైశ్య నాయకులు విద్యా వేత్తలు రైతు సోదరులు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘ నాయకులు కళా సంస్థ స్వచ్చంద సంస్థలు నాయకులు మహిళా సంఘాల నాయకులు బందు మిత్రులు ప్రజా ప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మండల అధికారులు కొండయ్యకు పత్రికా ముఖంగా అభినందనలు తెలియపరిచినారు. నాకు ఈ అవార్డు రావటం పట్ల మధిర ప్రజలు సహకారం మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారం ఎంతో మరువ లేనిది అని కొండయ్య తెలియజేస్తున్నారు.