జిల్లాలో ఈ నెల 25 నుండి సదరం శిబిరాల నిర్వహణ మండల ఎంపీడీవో అరుణ రాణి

Published: Saturday February 25, 2023

జన్నారం, ఫిబ్రవరి 24, ప్రజాపాలన :జిల్లాలో మార్చ్ ఒకటవ వ తేదీ నుండి సదరం శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి ఆదేశాలే మేరకు మండలం ఎంపీడీవో ఒక ప్రకటన తెలిపారు. శుక్రవారం మండలంలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఉండే దివ్యాంగులు ధృవీకరణ పత్రము పొందుటకు మీ-సేవలో స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత తేదీలలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో సంప్రదించాలని, గతంలో పొందిన సదరం సర్టిఫికెట్ పరిమిత కాలము పూర్తి అయిన వారు పునఃరుద్దరణ కొరకు, నూతన సర్టిఫికెట్ పొందుటకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఒకటవ తేదీన శరీరక వికలంగులు అర్థో, మార్చ్ 9వ తేదీన మూగ, చెవుడు వారికి , మార్చి 24వ తేదీ కంటి చూపు వారికి, మార్చి 28వ తేదీ మానసిక వికలాంగులకు తేదీలలో శిబిరాలు ఉంటాయని, రోజుకు 50 మంది చొప్పున పరీక్షించడం జరుగుతుందని, కంటి చూపు సమస్య గల వారికి మార్చి 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు తేదీలలో శిబిరం నిర్వహించడం జరుగుతుందని, రోజుకు 50 మంది చొప్పున పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. మీ-సేవ నందు స్లాట్ బుక్ చేసుకున్న వారు నిర్ణీత తేదీలలో సదరం క్యాంపుకు హాజరై దివ్యాంగ ధృవీకరణ పత్రాన్ని పొందాలని, ఈ అవకాశాన్ని దివందులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.