మహిళలకు హాట్ ఫిషల్ జువలరీ శిక్షణ తరగతులు

Published: Tuesday March 22, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి : సోమవారం రోజున యాచారం మండల పరిధిలో మేడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ వందరోజులు పూర్తి అయినవారికీ డి ఆర్ డి ఎ - సెర్ప్ ఆధ్వర్యంలో ఉనతిలో వందరోజులు పూర్తయిన 18 సం రాల నుంచి 40 సం రాలలోపు వయసుగల మహిళలకు హాట్ పిషల్ జువలరీ (గిల్టీనగలతయారి) పై శిక్షణ తరగతులు మండల అధ్యక్షురాలు కొప్పుసుకన్యభాష ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎస్ డి పి ఎం బాలరాజు ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఏ పీ ఓ  లింగయ్య, ఏ పి ఎం సతీష్, సీసీలు గణేష్, రాజు, ఉప సర్పంచ్ వార్డుమెంబర్లు ఉపాధిహామీ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.