టిఆర్ఎస్వి జిల్లా నాయకుడు పార్వతి అశోక్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన జెడ్పి చైర్ ప

Published: Friday July 08, 2022

ఆసిఫాబాద్ జిల్లా 07(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా జెడ్పీ కార్యాలయంలో గురువారం జెడ్పి చైర్ పర్సన్ కోవా లక్ష్మీ సమక్షంలో టిఆర్ఎస్వి జిల్లా నాయకుడు పార్వతి అశోక్ జన్మదిన సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ కో లక్ష్మి కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అశోక్ తెలంగాణ రాష్ట్ర సాధన లో విద్యార్థి విభాగం తరపున కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెరాస పార్టీ కొరకు ఎల్లవేళల అహర్నిశలు కష్ట పడే వ్యక్తిత్వం ఉన్న వారని తెలిపారు. రాబోయే రోజులలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండలం  నాయకులు తదితరులు పాల్గొన్నారు.