విద్యార్థులకు బోధన చేస్తున్న డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్

Published: Friday November 26, 2021
బాలాపూర్, నవంబర్ 25, ప్రజాపాలన (ప్రతినిధి) : పేదరికం నుండి బయటపడడానికి విద్య ఒక్కటే ఆయుధమని బడంగ్ పేట కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగ్ పేట లో ఉన్నత పాఠశాల గురువారం విద్యార్థుల ముఖాముఖిలో పాల్గొని ప్రతి సబ్జెక్టులోని విషయాల పై సందేహాలు తీర్చారు. విద్యార్థులందరికీ పేదరికము నుండి బయటపడడానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య ఒక్కటే ఆయుధమని తెలిపారు విద్యలేనివాడు వింత పశువుని విశదీకరించారు.