కమా‌ను... కనుమరుగు

Published: Tuesday June 22, 2021
జూన్ 21, ప్రజాపాలన తార్నాక : కనుమరుగైన రహదారి సూచిక బోర్డులు. అడిక్ మెట్, విద్యానగర్ మరియు ఉస్మానియా యునివర్సీటి వైపు వెల్లడానికి ప్రయాణికుల మరియు వాహనదారుల సౌకర్యార్థం తార్నాక ఆర్.టి.సి.హాస్పిటల్ దగ్గర రోడ్డు భవనాల శాఖ ఆ రహదారి ఏవైపు వెలుతుందనే వివరాలతో చాలా ఏల్ల క్రితం తోరణం ఏర్పాటు చేసినారు. ప్రస్తుతం ఆ సూచిక బోర్డు కనిపించడంలేదు. చెట్ల కోమ్మలు పెరిగి సూచిక బోర్డు కనుమరుగైనది. దీనితో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు, ప్రయాణికులు ఆ రహదారి ఎటు వెలుతుందో తెలియక అవస్తలు పడుతున్నారు. సంబధిత  అధికారులు స్పంధించి ఆ సూచిక బోర్డును వెంటనే యధాస్థితికి తీసుకురావలని పలువురు ప్రయాణికులు, వాహనదారులు కోరకుంటున్నారు.