ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి /**వడ్డెర వృత్తిదారులకు డబల్ బెడ్ రూమ్స్ ఇండ్

Published: Monday April 03, 2023
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలో శనివారం రాత్రి  వడ్డెర వృత్తిదారుల సంఘం కమిటి సమావేశం లో జరిగింది ఈ సంఘం సందర్భంగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు.విఘ్నేశ్  మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చింది వడ్డెర బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందనంగా వారి బతుకులు మాత్రం మారలేదని అన్నారు వడ్డెర వృత్తిదారులు నేటికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని సమాజానికి దూరంగా ఉన్నారని, కాబట్టి వారు అభివృద్ధికి కేవలం మూడు కోట్లు ఇచ్చి చేతులు దులుపుతుకుందని అన్నారు. ప్రభుత్వం వారి అభివృద్ధి కోసం ఏ విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ రాష్ట్రంలో సుమారుగా 4000 సొసైటీలు ఉన్న ఇప్పటికి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదన్నారు అంతే కాకుండా వడ్డెర వృత్తిదారులు చనిపోతే కనీసం ఎక్స్గ్రేషియా కూడా చెల్లించడం లేదని కాబట్టి వెనుకబడిన వడ్డెర కుటుంబాలకు వడ్డెర బంధును ప్రకటించి వెనుకబడిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇండ్లు లేని వారికి డబల్ బెడ్ రూములు ఇవ్వడం డిమాండ్ చేశారు అంతేకాకుండా రేషన్ కార్డులు పింఛన్లు ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఈఎండి లేకుండా 30% ప్రభుత్వ పనుల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో  నాయకులు సంపంగి నరసింహ సంపంగి బాలయ్య ఓర్సు బాలమ్మ తదితరులు పాల్గోన్నారు. అనంతరం నూతన గ్రామ కమిటిని ను ఎన్నుకున్నారు. గ్రామ కమిటి అధ్యక్షులుగా వరికుప్పల సాయిలు గ్రామ కార్యదర్శిగా వరికుప్పల బాలకృష్ణ ఉపాధ్యక్షులుగా వరికుప్పల రంగయ్య సంపంగి బాలరాజ్ మరియు సహాయ కార్యదర్శిగా సంపంగి తిరుపతమ్మ ఓర్సు రాములు కోశాధికారిగా సంపంగి బాలమ్మ మరో 20 మందితో కమిటీ వేయడం జరిగింది.