నీట మునిగిన పంట పొలాలు... రైతు కంట కన్నీరు...

Published: Wednesday September 14, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం  మండలం నెల్లిపాక బంజర వద్ద గోదావరి వరదలో మునిగిన వరి చేన్లు. ఇప్పటికీ నాలుగు సార్లు గోదావరి రావడంతో పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగి రైతుకు తీవ్ర నష్టం జరిగినది. దీనికి కారణం విపరీతంగా కురుస్తున్న వర్షాలు ఒకటైతే పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు, మరియు  ఆంధ్రాలో కడుతున్నటువంటి పోలవరం కాపర్ డ్యాం ఒక ఎత్తు. ఇప్పటికే గోదావరి నాలుగు సార్లు వచ్చి 50 అడుగుల పైన కూడా రావడంతో ఈ నాలుగు సార్లు కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు వరదలు వలన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంట నష్టపోయిన రైతులకి పంట నష్ట పరిహారం ఇవ్వవలసిందిగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో ప్రాజెక్టుల నుంచి వరదలు ఈ విధంగానే వస్తే మేము పంటలు ఎలా వేసుకోవాలి అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ పోలవరం ప్రాజెక్టు  నుంచి మమ్మల్ని రక్షించవలసిందిగా అని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా పోలవరం ముంపుప్రాంతం కింద ప్రకటించి తగిన నష్టపరహం ఇవ్వాల్సిందిగా కూడా ముంపు ప్రాంత చుట్టుపక్కల గ్రామ ప్రజలు కోరుతున్నారు...