అఖిల పక్షపార్టీల నాయకుల రెప్రజన్ టేషన్కు ఎమ్యెల్యే భట్టి విక్రమార్క సానుకూల తక్షణ స్పందన

Published: Saturday March 26, 2022
మధిర మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి : మధిర నియోజకవర్గ పరిధిలో అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో సెల్ఫీ మల్లు భట్టి విక్రమార్క కలిసిమధిర లోని బడ్డీకొట్ల తాలూకు చిరు వ్యాపారులు ఆందోళన చెందవద్దు బడ్డీకొట్ల తొలగింపు నిలుపు దలకు ఎమ్యెల్యే బట్టీ హామీ చిరు వ్యాపారస్తులకు అండగా ఉండాలనే నిన్నటి అఖిలపక్షాల నిర్ణయం ననుసరించి ఈరోజు పాదయాత్రలో ఉన్న మధిర శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్కని ముదిగొండ మండలం అమ్మపేట వద్ద కలిసి మధిరలోని బడ్డీకొట్ల తాలూకు చిరువ్యాపారుల జీవనోపాధికి భంగం కలిగించే చర్యలకు ఉపక్రమించ కుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల తరపున డాక్టర్ వాసిరెడ్డి రామనాధం సూరంసెట్టి కిషోర్ బెజవాడ రవిబాబు మల్లాది హనుమంతరావు లు వినతి పత్రాన్ని సమర్పించనైనది వెంటనే బట్టీ గారు స్పందించి కలెక్టర్ ఫోన్ చేసి బడ్డీకొట్ల దార్లందరికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేటంతవర్కు బడ్డీకొట్ల తొలగింపు చర్యలు తీసుకొనవద్దని వద్దని చెప్పారు అందుకు ఆమోదించినట్లు ఫోన్ టాక్ లో  కలెక్టర్  చెప్పారని మధిర శాసనసభ సభ్యులు భట్ పాదయాత్రలో ఉన్న ప్రజల సమక్షంలో తనకు వినతిపత్రం ఇచ్చిన రాష్ర్ట  తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మధిరనియోజకవర్గ టిడిపి ఇంఛార్జి  డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మధిర టౌన్ మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు మధిర మండల కాంగ్రెస్ అద్యక్షులు సూరంసెట్టి కిషోర్ సీపీఐ నాయకులు మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబులకు తెలియజేస్తూ ప్రకటించారుమధిరలో బడ్డీకొట్ల తొలగింపు సన్నాహ చర్యలు నిలుపుదల పట్ల అఖిలపక్ష పార్టీల సభ్యులు హర్షం వ్యక్త పరుస్తూ ఎమ్యెల్యే బట్టీ గారికి కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పత్రికా ప్రకటన చేశారు బడ్డీకొట్ల వారు  ఆందోళన చెందవద్దని అన్నారు అందరికి మంచే జరుగుతుందన్నారు