కేసుల దర్యాప్తులో నాణ్యత పాటించాలి **

Published: Friday December 16, 2022
జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ **
 
రౌడీలు,కేడీలు,సస్పెక్ట్ లపై నిఘా పెట్టాలి **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్15 (ప్రజాపాలన,ప్రతినిది) : జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్ లో ఉన్న కేసులలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషను పెంపొందించి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్లో  నెలవారీ నీరసమీక్ష నిర్వహించి ఓల్డ్ యు ఐ గ్రీవ్ కేసులు,ఎస్సీ ఎస్టీ కేసులు, కాంటెస్టెడ్ కేసులపై రివ్యూ నిర్వహించారు. పెండింగ్ కేసులలో గ్రీవ్, నాన్ గ్రివ్ కేసుల  గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి పోలీసులు న్యాయవాదులతో సమన్యాయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి పట్టణ గ్రామాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విసిఓలు పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయి వార్షిక పైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దామెర సుధాకర్, కు ఫంక్షన్ వర్టికల్స్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి జిల్లాఎస్పీ క్యాష్ రివార్డ్స్ అందించి అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, అదనపు ఎస్పీ (ఏ ఆర్) భీమ్రావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.