బోధనా సిబ్బంది వివరాలు నమోదు చేయాలి ** డీఐఈఓ శ్రీధర్ సుమన్ **

Published: Saturday December 31, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 30 (ప్రజాపాలన,ప్రతినిధి) :  జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో బోధనా సిబ్బంది వివరాలను నవీకరించాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి (డిఐఈఓ) శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం ఇంటర్ విద్య కార్యాలయం నుండి 11 ప్రభుత్వ, 20 ప్రభుత్వ రంగ, 6 ప్రైవేటు మొత్తం 47 కళాశాలల సిబ్బందితో "జూమ్ సమావేశం" ఏర్పాటు చేసారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో కొత్తగా రూపొందించిన "స్టాఫ్ ఎంట్రీ" ట్యాబ్ గూర్చి కూలంకశంగా వివరించారు. ఈ సంవత్సరం వార్షిక పరీక్షల్లో "ఆన్ లైన్ మూల్యాంకనం" తదితర నూతన పద్దతుల్లో బోధనా సిబ్బంది సెల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ,బ్యాంక్ అకౌంట్, పాన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయలని, ప్రిన్సిపాల్ వాటిని పరిశీలించి "అప్ డేట్" చేయాలని ఆదేశించారు. సిబ్బంది నియామక విధానం, నియామక తేదీ, సబ్జెక్టు, విద్యార్హతలు తదితర అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నవీకరించాలని అన్నారు. భవిష్యత్తులో "బోధనా సిబ్బంది" వివరాల్లో తప్పులు లేకుండా ప్రిన్సిపాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.