అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ కార్యక్రమం

Published: Wednesday February 02, 2022
బోనకల్ ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండల కేంద్రంలో స్థానిక సిఐటియు కార్యాలయం నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసంఘటిత కార్మికుల కొరకు ఈశ్రం క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మధిర ఏ ఎల్ ఓ లేబర్ ఆఫీసర్ చందర్ మాట్లాడుతూ ప్రతి ఒక కార్మికుడు దీనికి అర్హులు అని, ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలు వర్తింప చేయబడుననీ. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికునికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం క్రింద రెండు లక్షలు ప్రమాద బీమా, అంగవైకల్య భీమా ఉచితంగా వర్తింపజేయబడునని తెలియజేశారు. అదే విధంగా అసంఘటిత కార్మికులు అనగా వ్యవసాయ కూలీలు, అనుబంధ ఉపాధిహామీ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, ఉద్యానవన పనివారు, నర్సరీ, పాడి పరిశ్రమ, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు, వడ్రంగి పని వారు, రిక్షా కార్మికులు వీరందరికీ వర్తింపజేయునని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, గుంటి శ్రీను, చింతల లక్ష్మణ, గద్దల శ్రీను, నరసయ్య మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.