తాండూర్ నాపరతి క్రషింగ్ అసోసియేషన్ ఆర్థిక సహకారం

Published: Saturday July 30, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజా పాలన :  జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మన్నెగూడ నుండి వికారాబాద్ మెయిన్ రోడ్డు మరియు బీజాపూర్ హైవే రోడ్డుకు ఇరువైపులా మల్టీ లేయర్ పద్దతిలో నాణ్యమైన పెద్ద సైజు  రెండు వేల మొక్కలు కొనుగోలు చేసి నాటేందుకు తాండూర్ నాపరతి క్రషింగ్ అసోసియేషన్ వారి తరపున ఆర్థిక సహకారం అందించడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.  శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో   ఏడి మైన్స్ శాఖ ఆధ్వర్యంలో  స్టోన్ అండ్ క్రషింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతన్య మరియు సభ్యులు జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా కలసి అందుకు సంబందించిన చెక్కును అందజేసినారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి హరితహారంలో గతంలో కన్నా భిన్నంగా అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటి వికారాబాద్ ను గ్రీన్ సిటీగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ డి మైన్స్ సాంబశివారావు, డి ఆర్ డి ఓ కృష్ణన్ స్టోన్ అండ్ క్రషింగ్ యూనియన్ ప్రెసిడెంట్ చైతన్య, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు.