డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం ** మహనీయుల 92వ వర్ధంతి సందర్భంగా ** డివైఎఫ్ఐ జిల్ల

Published: Saturday April 01, 2023

ఆసిఫాబాద్ జిల్లా మార్చి 31(ప్రజాపాలన,ప్రతినిధి) : స్వాతంత్ర పోరాట విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవు,ల 92వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా ఎస్సై గంగన్న, ఆస్పత్రి సుపెండెంట్ స్వామి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అమరులైన మహావీరులు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్, లు వారి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. వారిని స్ఫూర్తి తీసుకొని యువత స్వాతంత్రం ప్రజాస్వామ్యం లౌకికత్వం కోసం పోరాడాలని అన్నారు. గిరిజనులకు సరైన పోస్ట్ కారం లేకపోవడం బాలింతలలో రక్తహీనత తల సేమియా బాధితులకు నెలనెలా రక్తం అందించడం ఆక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం అందక మన్నించే సంఘటనలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో రక్తం కోసం ప్రజలు పాట్లు అన్నారు. ఆ పరిస్థితి రాకుండా రక్తదాన శిబిరాన్ని మరింతగా నిర్వహించాలని యువత రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక సేవకులు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కెవిపిఎస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.