ప్రజల కష్టాలు పట్టించుకోని మోడీ ప్రభుత్వం, బడా వ్యాపారుల కే పెద్దపీట....

Published: Friday May 20, 2022
ఎరుపాలెం మే 19 ప్రజా పాలన ప్రతినిధి: 
ఆకాశమే హద్దుగా నిత్యావసర ధరలు చుక్కలను
 దాటి దూసుకుపోతున్నాయని వాటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు  చే పట్టిందా, గత ఐదు సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నా మోడీ ప్రభుత్వం ఆ దశలో ఒక్కటంటే ఒక్క చర్య కూడా చేపట్టలేదని అదే  సమయంలో బడా వ్యాపారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని జమలాపురం గ్రామ శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు కామ్రేడ్ స్వర్గీయ గద్దల సంగయ్య కుమారుడు మహేందర్ రత్నకుమారి వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెను భారాలను మోపుతున్నాయని దేశంలో ధరలు దండిగా పెరుగుతూ ప్రమాద స్థాయికి చేరాయని కోట్లాది మంది ప్రజలు ఆకలి బాధలతో  పేదరికంలోకి నెట్టి వేయబడ్డారని విమర్శించారు. నానాటికీ నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయికి పెరిగిపోవడంతో ప్రజల కష్టాలు మరింత గా పెరిగాయన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు వంట గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరం పెరగడం, బొగ్గు కొరత వలన విద్యుత్ ఖర్చు పెంచుతుందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం లో నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని విద్యుత్ రేట్లను అధికంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని అన్నారు. అనంతరం నరసింహాపురం గ్రామ శాఖ సీనియర్ పార్టీ సభ్యులు చిత్తూరు రాజు ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్యల వీరయ్య, ఆంగోతు వెంకటేశ్వర్లు, పెసర మల్లి ఇమెయిలమ్మ, కూడెల్లి నాగేశ్వరరావు, తాళ్లూరి వెంకటనారాయణ, కోలా రాములు, గామాసు జోగయ్య, చిత్తారి కిషోర్, కృష్ణ, కోలా రవి, తదితరులు పాల్గొన్నారు.