సాప్ట్ వేర్ రంగంలో సత్తా చాటిన బీపీ నాయక్ టీమ్ ఎక్స్ లెన్స్ - టెక్నాలజీ లీడర్ అవార్డుకు ఎంపి

Published: Thursday July 14, 2022
బోనకల్, జులై 14 ప్రజా పాలన ప్రతినిధి: ఇటు రాజకీయ రంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ, తన సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న యువనేత బీపీ నాయక్ అటు తన వృత్తి సాప్ట్ వేర్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. కౌలాలంపూర్ కేంద్రంగా బుధవారం నాడు ప్రవేశపెట్టిన ఆసియా పసిఫిక్ టెక్నాలజీ అవార్డ్స్ -2022 లో మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, శ్రీలంక తదితర దేశాలతో పోటీపడుతూ  టీమ్ ఎక్స్ లెన్స్ - టెక్నాలజీ లీడర్ అవార్డుకు ఎంపియ్యారు. పలు విధాలుగా బోనకల్ గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న బీపీ నాయక్ ను సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ పెద్దలు ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సాధించాలని ఆశీర్వదించారు.