ఆధ్యాత్మిక చింతనతో మానవమనుగడ

Published: Tuesday April 12, 2022
పట్లూరు సర్పంచ్ ఇందిర దేవరదేశి అశోక్
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజాపాలన : ఆధ్యాత్మిక చింతన తో మానవ మనుగడ కొనసాగుతుందని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. సోమవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడి నుండి బుగ్గ రామేశ్వర్ దేవాలయం వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 5 లక్షల జిపి నిధులతో 1200 మీటర్ల పొడవు గల ఫార్మేషన్ నిర్మాణం చేపట్టనున్నామని పేర్కొన్నారు. చాలా సంవత్సరాల నుండి 100 ల మంది రైతులు గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేర్చుటకు ఆ బుగ్గరామేశ్వరుని అనుగ్రహం మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. బుగ్గ రామేశ్వరుని దర్శించుకొనుటకు గ్రామస్తులు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో జీవించేందుకు బుగ్గ రామేశ్వరుని ఆశీర్వాదాలు లభించాలని వేడుకున్నారు. భక్తకోటి మేరకు జీపీ నిధుల నుండి ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ పూజ కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న సురేష్, వార్డ్ మెంబర్స్ నీలమ్మ, అంజాత్, పార్టీ అధ్యక్షులు జి.అశోక్, మాజీ అధ్యక్షులు గడ్డపు నర్సిములు, గ్రామ పెద్దలు తుమ్మల కిష్టయ్య, ఏ.శంకరయ్య, రాములు, హన్మంత్, గపూర్ మియా, భీమయ్య, అంజయ్య, మహేష్, వెంకటయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.