విపత్తులోనూ ఆగని వ్యవసాయ సబ్సీడీ విత్తనాలు డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు

Published: Thursday June 03, 2021
పాలేరు, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా :-నేలకొండపల్లి మండలం. కరోనా లాంటి విపత్తులోనూ వ్యవసాయ సబ్సీడీ విత్తనాలు ఆపటం లేదని డీసీఎంఎస్ డైరెక్టర్, పైనంపల్లి సోసైటీ చైర్మన్ నాగుబండి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని పైనంపల్లి సోసైటీలో బుధవారం సబ్సీడీ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విపత్తులోనైనా సంక్షేమంను ఆపదని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్వేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రైతులు సబ్సీడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ్రు విజయలక్ష్మి, ఎంపీటీసీ ఉసిరికాయల లక్ష్మయ్య, సొసైటీ ఉపాధ్యాక్షుడు భాస్కర్, మండల రైతుసమన్వ సమితి సభ్యులు మారగాని పద్మారావు, రైతు ప్రతినిధులు గడ్డం సత్యం. కొండ్రు క్రాంత్రి, వేనేపల్లి