సంఘ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ

Published: Thursday November 18, 2021
యాదాద్రి నవంబర్ 17 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో బుధవారం మత్స్య సహకార సంగం భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ నిధులను గతంలో 5 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ పూర్తికాకపోవడంతో ఇటీవల మంజూరైన నిధుల నుండి అసంపూర్ణంగా మిగిలిన ఉన్న భవనానికి పూర్తి చేయడం కోసం 5లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం అయినదని ఆయన తెలిపారు. పనులను వెంటనే పూర్తి చేయాలని సంఘం నాయకులు తెలియజేశారు. నాణ్యమైన పనులను దగ్గర ఉండి నిర్మాణం చేయించుకోవాలని చైర్మన్ చెవ్వ వెంకటేష్ కు తెలిపారు. గతంలో చేసిన నిర్మాణం పనిలో నాణ్యత లోపించిందని వాటిని సరిచేసి పూర్తి చేయాలని, అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో సందర్శించి అక్కడ కావలసిన వసతులను అడిగి పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుని, ప్రహరి గోడ ఇతర అవసరాలు ఉన్నాయని, వాటిని కూడా పరిశీలిస్తానని ఎస్టిమేషన్ వేసి అధికారుల ద్వారా సమర్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ  గ్రామ శాఖ అధ్యక్షులు కలుకురి రాములు, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి కూచిమల్ల సుధాకర్, మత్స్య శాఖ చైర్మన్ చెవ్వ వెంకటేష్, ఉపాధ్యక్షుడు పిట్టల కుమార్, ప్రధాన కార్యదర్శి నాగలి యాదగిరి, విద్యా కమిటీ చైర్మన్ కడవేరు యాదగిరి, గుర్రాల రాములు, బుడుగు కిష్టయ్య, పరకాల వెంకటేశం, గునిగంటి రాములు, మల్లం నరేష్, తదితరులు పాల్గొన్నారు.