మర్పల్లి మోమిన్పేట్ కోట్పల్లి మండలాలకు తాగునీటి సరఫరా అంతరాయం

Published: Tuesday August 31, 2021

మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక అభియంత కే సువర్చల

వికారాబాద్ బ్యూరో 30 ఆగస్ట్ ప్రజాపాలన : కేసారం రైల్వే అండర్ టన్నెల్ పనులు జరుగుతున్న స్థలములో నీటి పైప్ లైన్ కు పాక్షిక మరమ్మతులు జరుగుతున్నాయని మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక అభియంత కే సువర్చల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వే అండర్ టన్నెల్ పనులు జరుగుతున్న చోట పైప్లైన్ కింద ఉన్న మట్టి క్రుంగిపోయినందువలన మర్పల్లి మోమిన్పేట్ కోటపల్లి మండలాలకు చెందిన 77 గ్రామాలలో తాగునీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. మర్పల్లి మండలంలోని 34 గ్రామాలు మోమిన్పేట్ మండలం లోని 37 గ్రామాలు కోటపల్లి మండలం లోని ఆరు గ్రామాలకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు తాగునీటి సరఫరా పాక్షికంగా రద్దు చేయబడుతుంది అని వివరించారు. దీనికి తోడు గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కేసారం రైల్వే అండర్ టన్నెల్ వద్ద నీరు ఎక్కువగా నిలవడంతో పాక్షిక మరమ్మతుల పనులకు ఆటంకం కలిగిందని చెప్పారు. నీటి సరఫరాలో కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఉద్ఘాటించారు. మర్పల్లి మోమిన్పేట్ కోటపల్లి మండలాల గ్రామ ప్రజలు సహృదయంతో సహకరించాలని కోరారు.