కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు ఓ వరం... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి

Published: Tuesday January 10, 2023
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసిల్దార్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన (42) కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను  లబ్ధిదారులకు సుమారు (42) లక్షల రూపాయల విలువ గల చెక్కులను బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదింటి  ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టారని అన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 10 లక్షల 56వేల 239 పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వం  అందజేసినట్లు తెలిపారు., పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తుంది అన్నారు., సీఎం కేసీఆర్  సహాయంతో ఎంతోమంది పేద కుటుంబాలకు పెండ్లి భారం తగ్గిందిని తెలిపారు., ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్  కల్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని గత ప్రభుత్వాలు ఇలాంటి సంక్షేమ పథకాలను ఇచ్చింది లేదని, కానీ బిఆర్ఎస్  ప్రభుత్వం ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష 116 రూపాయలు సహాయం అందించడంతో పాటు బిడ్డకు కానుపయితే కేసీఆర్ కిట్టు పైసా ఖర్చు లేకుండా తల్లిదండ్రులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దింపుతుందని ఇది మా ప్రభుత్వ గొప్పతనం అని వారు అన్నారు., ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం లభిస్తుంది అని  కూడా ఆమె అన్నారు., సీఎం కేసీఆర్  దేశంలో  ఎక్కడ లేనటువంటి అనేక పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు భీమా వంటి అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు..
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు తహసిల్దార్ భగవాన్ రెడ్డి, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, బూర్గంపాడు మండల సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,  పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, బిఆర్ఎస్  పార్టీ మండల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, సారపాక టౌన్  పార్టీ ప్రెసిడెంట్ కొనకంచి శీను, మండల యువజన విభాగం అధ్యక్షులు గోనెల నాని, మైనార్టీ మండల నాయకులు  సోహెల్ పాషా,   భూక్య శ్రావణి, పోతునూరి సూరమ్మ, కోదిమే వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి భూపల్లి నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు మొండెద్దుల వెంకటేశ్వర్ల రెడ్డి, మండల మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సాదిక్, మండల మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుల్ మొహమ్మద్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీను నాయక్, పార్టీ నాయకులు గాదే నర్సిరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, బిట్ర సాయిబాబు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.