రక్త హీనత తో బాధపడే గర్భిణులకు, చిన్నారులకు, మహిళలకు ఉచిత వైద్యసేవలు

Published: Friday February 11, 2022
బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యoతో మెగా క్యాంప్
బోనకల్, ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని రక్తహీనతతో బాధపడే చిన్నారులకు, యువతలకు, మహిళలకు, గర్భిణులకు బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యoతో మేఘ శ్రీ హాస్పిటల్ నందు ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత రక్త పరీక్షలతో పాటు వైద్య సేవలు, మందులు అందిచనునట్లు మేఘ శ్రీ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డా. టి పవన్ కుమార్, డా.ఎల్ గంగాధర్ గుప్తా, ఎస్ లావణ్య తెలిపారు. మండల కేంద్రంలోని మేఘ శ్రీ హాస్పిటల్ నందు బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యoగా చిన్నారుల్లో రక్తహీనత (అనిమియా) శాతం పెరగడానికి పలురకాల కారణాలను వారు తెలిపారు. పుట్టిన సమయంలో తల్లి రక్తహీనతతో బాధపడటం, కావాల్సినన్ని రోజులు పాలు ఇవ్వకపోవడం, ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అందిం చకపోవడం, పరిసరాలు శుభ్రంగా ఉండకపోవడం, సురక్షిత నీరు తాగ క పోవడం వంటి కారణాల వల్ల చిన్నారుల్లో రక్తహీనత పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనత పెరగడానికి ఐరన్‌ సం బంధిత ఆహారం తీసుకోకపోవడం, విటమిన్‌ సీ ఫలాలు తీసుకోకపోవడం, ఎక్కువగా కాల్షియం లభ్యమయ్యే ఆహా రాలను తీసుకోవడం, మెన్‌స్ర్టేషన్‌ సమయంలో ఎక్కువగా ఐరన్‌లాస్‌ జరగడం, చిన్నప్పటి నుంచి ఐరన్‌ డెఫిషెయన్సీతో బాధపడటం, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్‌ వల్ల ఐరన్‌ లాస్‌ ఎక్కువగా జరగడం, బాల్య వివాహాలు వంటి కారణాలను ప్రధానంగా పేర్కొన్నారు. రక్త హీనతతో బాధ పడే వారు ఈ సదవకాశాన్ని స్వదినియోగo చేసుకోగలరని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బత్తినేని నీరజ, తూము రోషన్ కుమార్, ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎం స్వరూప రాణి, రాములమ్మ, సుజాత, దంత వైద్యులు ఎస్ ఉదయ్ కిరణ్, మెడికల్ క్యాంప్స్ నిర్వహాకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాధ్ తదితరులు పాల్గొన్నారు.