విద్యుత్ ఫేస్ టు లైన్ నుండి త్రీ ఫేస్ లైన్ కు మారాలని ఏ. ఈ కి వినతి

Published: Wednesday March 24, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన ; శ్రీ రామ్ కాలనీ, రాజ్య లక్ష్మి నగర్ కాలనీ లో విద్యుత్ టు ఫేస్ లైన్ నుండి త్రీఫేస్ లైన్  కు (25kv to 63kv or 100kv) విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కార్పొరేషన్ కార్పొరేటర్ విద్యుత్ యంజాల ఏ. ఈ ఎం.డి తాజుద్దీన్ కు వినతి అందజేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 27 వ డివిజన్ కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి ఆ  డివిజన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ రామ్ నగర్ కాలనీ, రాజ్యలక్ష్మి నగర్ కాలనీ ప్రజలు వేసవి కాలం మొదలైన సందర్భంగా కరెంటుతో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ స్పందించి మాట్లాడుతూ..... విద్యుత్  పేస్ టు లైను గతంలో ఉండేది. (25కేవీ ట్రాన్స్ఫారం ) కరెంటు లోడు పెరిగి ఈ సమస్య అధికమవుతుందని,  కావున టు ఫేస్ లైవ్ మారించి, త్రి ఫేస్ లైన్స్ కలప గలరని ఆశిస్తున్నా ప్రజలకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ తుర్కాయంజల్ ఏ. ఈ ఎం డి తాజుద్దీన్ కు చెప్పారు. అదేవిధంగా 25 కె.వి ట్రాస్స్ ఫార్మర్ దాని స్థానంలో 63 కె.వి లేదా 100 కె.వి ట్రాస్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. వెంబడే స్పందించిన ఏ ఈ తాజుద్దీన్ తొందరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.