లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల పై దృష్టి పెట్టండి డ్యాం, ఎల్ఎండి దగ్గర నివసిస్తున్నా ప్రజల

Published: Wednesday July 13, 2022
వర్షాలతో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
 
ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టండి 
 
     జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
 
  కరీంనగర్ జూలై 12 (ప్రజాపాలన ప్రతినిధి :
భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు గైకొనాలి అని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
మంగళవారం సాయంత్రం రెవెన్యూ, మున్సిపల్, వైద్య, ఇరిగేషన్ శాఖ అధికారులతో భారీ వర్షాల కలిగిన నష్టాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల శిధిలావస్థలో ఉన్న గృహాల గోడలు, కరెంటు స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉన్నందున అట్టి వాటిని గుర్తించి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.  వర్షాల వల్ల సీజనల్ డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, ఎంపిఓ, ఎంపీడీవో లతో ప్రతిరోజు సమీక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎల్ ఎం డి, డ్యాం ల సమీపంలో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రా పాఠశాలలలో తరలించాలని, పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం మండలాల వారీగా ఇంచార్జ్
అధికారులను నియమించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి వివరాలు మండలాల వారీగా సెంటర్ వారీగా నివేదిక అందజేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. చెరువులు, రోడ్లు దెబ్బతిన్న వాటి వివరాల నివేదికను ఎప్పటికప్పుడు పంపాలని తాహసిల్దార్ లను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల పై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నష్టపోయిన వారికి రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, ఆర్డిఓ ఆనంద్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.