ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 12ప్రజాపాలన ప్రతినిధి *మహిళా సాధికారతే నవ్య ఫౌండేషన్ లక్ష్యం* * ఘన

Published: Tuesday December 13, 2022


పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ నవ్య ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ మడుపు శ్రీ రమ్య వేణుగోపాల్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని వైష్ణవి ఫంక్షన్ హల్లో సోమవారం నవ్య ఫౌండేషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మడుపు వేణు గోపాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో మొదట కుమార్ జనపాద బృందం, ఆధ్వర్యంలో పాటలుపాడి వినిపించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన అందర్నీ అలరించాయి. దివ్యంగులు అద్భుతమైన గానం చేత వీక్షకులను ఉర్రూతలు ఉగించారు.ముఖ్యఅతిధిగా ఐఎన్ టియూసి రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పి కృపేష్ మాట్లాడుతూ నవ్య ఫౌండేషన్ సేవా కార్యక్రమాల పట్ల తను నిజంగా గర్వపడుతున్నాని,పేద ప్రజల అభ్యున్యతి కోసం అనునిత్యం పాటుపడుతూ స్వంత ఖర్చులతో పలువురికి సహాయ పడుతూన్నారని,ఎల్లపుడు ఫౌండేషన్ కు అండగా ఉంటామన్నారు.ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా దాదాపు వెయ్యిమందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని,అనేక రంగాల్లో యువతకు,మహిళలకు చేతివృతుల్లో కంప్యూటర్ కోర్సుల్లో కుట్టుమిషన్ శిక్షణలో శిక్షణనిచ్చి ఉపాధి చూపించడం స్వయం ఉపాధికి ప్రోత్సాహించడం జరిగిందన్నారు. ఎల్లప్పుడు యువతకు, మహిళలు, పేదల అభివృద్ధి కొరకే ఫౌండేషన్ ముందుంటుందాన్నారు. అనంతరం నవ్య ఫౌండేషన్ చైర్మన్ మడుపు శ్రీ రమ్య  జన్మదిన వేడుకలకు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి,ఎస్ఐ నాగేందర్ నాయకులు బూడిద నర్సింహ్మ రెడ్డి,లయన్ కె వి రమేష్ రాజు,కసరమోని మల్లేష్,ముత్యాల రాజశేఖర్, జెలమోని రవీందర్,తాళ్ల మహేష్ గౌడ్,టేకుల రాంరెడ్డి,గోపిగౌడ్, మహేందర్,కర్నె అరవింద్ ఎంపీటీసీ జయనందం, కౌన్సిలర్ నీలం శ్వేత భాను,తిరుమలేష్, ఆర్గనైజర్ వి కృష్ణ,ఫౌండేషన్ సభ్యులు మాజీ ఎంపీటీసీ నవ్య ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రియ, డైరెక్టర్ పంతంగి మాధవి తదితరులు పాల్గొన్నారు.