పారిశుధ్య కార్మికుల సేవలు అనిర్వచనమని కోనియెడిన మున్సిపల్ చేర్ పర్సన్ డా.బోగ శ్రావణి

Published: Wednesday September 29, 2021
జగిత్యాల, సెప్టెంబర్, 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ  దేవిశ్రీ గార్డెన్ మున్సిపల్ కమిషనర్ జి.స్వరూప రాణి అధ్వర్యంలో కార్మికులకు ఏర్పటు చేసిన అవగాహన సమావేశంలో చేర్ పర్సన్ డా.బోగ శ్రావణి పాల్గొన్నారు. చెర్ పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుత కరోన, వర్ష సీజనల్ కాలములో పారిశుద్ధ్య కార్మికులు చాలా బాగా చేస్తున్నారని కృతఙ్ఞతలు తెలిపారు. పట్టణ పారిశుధ్య పనులను కార్మికులు కలిసి కట్టుగా 100 శాతం పూర్తి చేయాలని, పట్టణమునకు గుర్తింపు తీసుకురావాలని దిశ నిర్దేశం చేశారు. కార్మికులందరికి యూనిఫార్మము అందిస్తామని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు అందరూ కృషి చేస్తూ పట్టణ పారిశుధ్యమును మెరుగు పరచాలని, ఇంటి నుండే చెత్తను తడి మరియు పొడిగా వేరు చేసి మున్సిపల్ వాహానములను అందిచాలని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్మికులకు సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్థామని తెలిపారు. ప్రతి నెల ఉత్తమ కార్మికులని గుర్తించి సత్కరించడం జరుగునని తెలిపారు. ఈ సమావేశములో సానిటరి ఇన్స్పెక్టర్లు అశోక్, రాము జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.