మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి కెసిఆర్ మూర్ఖపు పాలను గద్దె దించండి: యువనేత బీపీ నాయక్

Published: Thursday June 30, 2022
బోనకల్, జూన్ 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డి.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన గ్రామకమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా యువనేత బీపీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ జూలై 3వ తారీకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ భారీ బహిరంగ సభ ఒక చారిత్రాత్మక సభ కానుంది అని, సుమారు 10 లక్షల మంది జన సమీకరణకు ప్రణాళిక చేశారని, వినూత్నంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ గడ్డను ఎన్నుకోవడం మన అందరి అదృష్టంమని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మొదలుకొని 40 మంది కేంద్ర మంత్రులు, 18 ముఖ్యమంత్రులు, 29 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఇన్చార్జ్ లు, 119 అసెంబ్లీ స్థానాలను 119 జాతీయ నాయకులను పంపడం సమన్వయం చేయడం తెలంగాణ రాష్ట్రమంతా చర్చనీయాంశం అవుతున్నదని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి సంకేతమని,
సికింద్రాబాద్ గ్రౌండ్లో లో 10 లక్షల మంది ఒకేసారి భారత్ మాతాకీ జై అని అంటుంటే చూసే మహాభాగ్యం మనకు దక్కుతుందని గుర్తు చేశారు.భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో ఆసక్తితో అన్ని విషయాలలో మొదటి ప్రాధాన్యత ఇస్తుందని,నాయకులు,కార్యకర్తలందరూ కూడా ఎక్కువగా కష్టపడి పని చేయాల్సిన సమయం ఆసన్నమైనదని ,రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖపు పాలను గద్దెదించే వరకు పోరాటం చేయాలని సహచర పార్టీ మిత్రులకు కార్యకర్తలకు సూచించారు. కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని ఎవరు అధైర్య పడకుండా నూతనోత్సాహంతో ముందుకు అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి, మండల యువమోర్చా అధ్యక్షులు కాలసాని పరశురాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మరీదు పరశురాముడు, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మందా రాజ్యం, సురేష్, లక్ష్మయ్య, మొండితోక ఆదాం, సైదులు, పెద్ద కిట్టయ్య, ఆదామ్ వేల్పుల, గద్దల బూసి, జీవరత్నం, లక్ష్మణ్, రమేష్ వేల్పుల, దేవమణి సాంబ గ్రామస్తులు, ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.