సంగారెడ్డి జిల్లా ఖేడ్ లో పిఎంజిఎస్.వై. రోడ్ల జాతీయ నాణ్యత నిపుణులు బినయ్ కుమార్ సిన్హా తనిఖ

Published: Friday December 17, 2021
హైదరాబాద్ 16 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పి.యం.జి.ఎస్.వై) పథకం కింద నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ పరిధిలో మంజూరైన పలు రోడ్ల నాణ్యతను జాతీయ నాణ్యత నిపుణులు బినయ్ కుమార్ సిన్హా తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం మరియు నాగల్ గిద్ద మండల పరిధిలో ప్రగతి లో ఉన్న ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా మంజూరైన పలు రోడ్ల నాణ్యతను జాతీయ నాణ్యత నిపుణులు బినయ్ కుమార్ సిన్హా బేస్తవారం నాడు తనిఖీ చేశారు. మంగల్ పేట పిడబ్ల్యుడి రోడ్డు నుండి గునుగులకుంట తాండా వయా  నమిలెమెట్టు పోతన్ పల్లి, మద్వార్ 6.74 కిమీ రోడ్డు మరియు కరాస్ గుర్తి పిడబ్ల్యుడి రోడ్డు నుండి కర్నాటక బార్డర్ వయా మోర్గి షాపూర్ 6.5 కిమీ రోడ్లను తనిఖీ చేశారు. మెటల్ బిటి గ్రావెల్ షోల్డర్ల నాణ్యతను డెన్సిటీ తేమ గ్రెడేషన్ మొదలగు వివిధ రకాల టెస్టు లను క్షేత్ర స్థాయిలో పరిక్షించారు. అంగ్రిమెట్ కాలపరిమితి లోపు పని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. బోర్గి లోని క్వాలిటీ కంట్రోల్ లాబోరేటరిని తనిఖీ చేశారు. సైట్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచాలని  ఆదేశించారు. ఆందోల్ పంచాయతీ రాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య తాల్క డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  జి.కొండయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ రాకేష్ కుమార్, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ ఇంజనీర్  శశిధర్ రెడ్డి, రోషన్ రెడ్డి, నర్సింహా రెడ్డి సిబ్బంది వెంట ఉన్నారు.