పూర్ణహుతితో చండి యాగం సంపూర్ణం

Published: Tuesday August 23, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో గత ఐదు రోజులుగా తలపెట్టిన సహస్ర చండీ యాగం సోమవారం పూర్ణాహుతితో సంపూర్ణం అయ్యిందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు.  సహస్ర చండీయాగం లో  4రోజులు పలు దేవతల కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. చివరి రోజు సోమవారం పూర్ణాహుతితో సంపూర్ణంగా పూర్తికావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
పూర్ణాహుతి మహోత్సవానికి ముఖ్యఅతిధులుగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, 
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,  చామకూర మల్లారెడ్డి. ఎమ్మెల్సీ ,కేసీఆర్  రాజకీయ కార్యదర్శి  శేరి శుభాష్ రెడ్డి, వికారాబాద్ జడ్పి చైర్పర్సన్  పట్నం సునీతా రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి  విజయేశ్వరి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి , జైపాల్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ వేణుగోపాల చారి , డిసిసిబి చైర్మన్  బి.మనోహర్ రెడ్డి, డిసియంఎస్ చైర్మన్ కృష్ణా రెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.