కంటి చూపును ఇవ్వడం మరో జన్మను ప్రసాదించడమే,

Published: Thursday November 25, 2021

లయన్స్ క్లబ్ జిల్లా సేవల సమన్వయకర్త సింహరాజు కోదండరాం.

వెల్గటూర్, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : కంటిచూపును ఇవ్వడం అం మరో జన్మలో ప్రసాదించడమే, ఈ సమస్యలతో బాధపడే వారికి నేత్ర వైద్య సేవలు అందించి వారిని శాశ్వత అంధత్వం నుంచి కాపాడేందుకు లైన్స్ క్లబ్ సేవల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రధానమైనదని లయన్స్ క్లబ్ సేవల జిల్లా కోఆర్డినేటర్ సింహరాజు కోదండరాం అభిప్రాయపడ్డారు. మంగళవారం వెల్గటూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కంటి చూపు తో బాధపడేవారు చికిత్సకోసం వచ్చారు. 200 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో 75 మందికి మోతె బిందు (కంటిలో శుక్లాలు) సమస్య ఉన్నట్టు నిర్ధారించడం జరిగింది. వీరిని రేకుర్తి కంటి ఆస్పత్రి లో శస్త్రచికిత్స చేయించడానికి గుర్తించారు. తొలివిడతగా రేకుర్తి కంటి ఆసుపత్రి ప్రత్యేక వాహనంలో 25 మందిని శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని విడతలవారీగా శస్త్ర చికిత్సలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సింహ రాజు కోదండరాం మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేపడుతున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో నేత్ర వైద్య శిబిరం అత్యంత ప్రధానమైనదని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థ అయిన లయన్స్ క్లబ్ ద్వారా నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు లక్షలాది మందికి రేకుర్తి కంటి ఆసుపత్రి ద్వారా శస్త్ర చికిత్సలు చేయించి శాశ్వత అంధత్వం నుంచి విముక్తి కల్పించడం జరిగిందన్నారు. వృద్ధాప్య దశ లో కంటిచూపును ప్రసాదించడం వారికి మరో జన్మ ను అందివ్వడం లాంటిదని పేర్కొన్నారు.  మారుతి మెడికల్ స్టోర్ ఆవరణలో జరిగిన ఈ శిబిరంలో వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి మెడికల్ షాప్ యజమానులు కాశ శ్రీధర్, కాశ రవి లు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, కార్యక్రమంలో అధ్యక్షుడు మద్ది మురళీధర్, కార్యదర్శి వైద్య వెంకట్, కోశాధికారి గట్ల రాజేందర్, ఉపాధ్యక్షులు సిరిపురం తిరుపతి, నోముల వెంకట్ రెడ్డి, పి ఆర్ ఓ నక్క సురేష్, డైరెక్టర్ల బోర్డు సభ్యులు బండారి చంద్రమౌళి, తిప్పర్తి పురుషోత్తం, తిప్పర్తి భూమయ్య, సంకోజు నరేష్, గాదాసు రాజేందర్, రేకుర్తి ఆస్పత్రి వైద్య బృందం సభ్యులు ప్రభాకర్, స్వామి, ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, కళ్యాణి.