మహిళా సంఘాలు సహజ ప్రోడక్ట్ --వ్యాపారం తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ---మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Wednesday June 08, 2022

వెల్గటూర్, జూన్ 07 (ప్రజాపాలన ప్రతినిధి) : కల్తీ లేని నిత్యవసర వస్తువులు తయారు చేసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ధర్మపురి నియోజకవర్గ మహిళల కోసం సహజ ఉత్పత్తుల మార్కెటింగ్ అవగాహన సదస్సును జగిత్యాల, పెద్దపల్లి జిల్లా డి.ఆర్.డి మంగళవారం రాజారామ్ పల్లి లో అమృతంగా ఏర్పాటుచేసికి అతిథిగా హాజరై నైన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ అన్నారు. సహజ ప్రొడక్ట్  ద్వారా ముప్పై మూడు రకాల వస్తువులను మార్కెటింగ్ జరుగుతుందని మంత్రి తెలిపారు. తక్కువ శ్రమతో నాణ్యమైన వస్తువులను ఎక్కువ లాభం పొందడం కోసం ఈ అవగాహన సదస్సు అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, పెద్దపల్లి డి ఆర్ డి ఓ అధికారులు వినోద్ కుమార్, సుధీర్ కుమార్, సునీత, సందీప్, వంశీ,సురేందర్, ఎంపీపీ మీ కునమల్ల లక్ష్మీ లింగయ్య, జెడ్.పి.టి సి.బి. సుధారాణి రామస్వామి, సర్పంచ్ గెల్లు శేఖర్, ఏ.ఎం.సి చైర్మన్ పత్తిపాక వెంకటేష్, బలరాం రెడ్డి, జెడ్పీటీసీలు ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అభివృద్ధి అధికారి సంజీవరావు, తహసీల్దార్ రమేష్, మండల విద్యాధికారులు ఏం.పి.ఎం, ఏ.పీ.ఒ, మండల సమైక్య సంఘ అధ్యక్షులు, గ్రామ సమైక్య అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, సింహాచలం జగన్, జూపాక కుమార్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఏలేటి కృష్ణారెడ్డి, మహిళా సంఘ సభ్యులు వివిధ రకాల తినుబండారాలు, అవసర వస్తువులు ఉత్పత్తి చేస్తున్న సంఘాలు వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసిన మంత్రి ఆసక్తిగా తిలకించారు